Header Banner

అరబ్ దేశాలను సాయం కోరుతున్న పాకిస్థాన్! ఒత్తిడి తగ్గించాలంటూ ప్రయత్నాలు!

  Sat May 03, 2025 08:24        India

పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై భారత్ మండిపడుతోంది. ఈ దాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. అనేక దేశాలు భారత్‌కు మద్దతుగా నిలిచాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తుండటంతో భారత్ నుంచి ఎదురయ్యే ప్రతిఘటనపై పాకిస్థాన్ ఆందోళన చెందుతోంది. పైకి ధీమాగా ఉన్నట్లు కనిపించినా, భారత్ చర్యలపై భయంతో రక్షణ కోసం పాక్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ ప్రభుత్వం ప్రపంచ సహాయం కోరుతోంది. ఇప్పటికే చైనా, రష్యాలను అభ్యర్థించింది. ఈ దాడిపై నిష్పక్షపాత విచారణకు సహకరిస్తామని పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు.

రెండు దేశాల మధ్య ఘర్షణను తగ్గించాలని కోరారు. ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రస్‌తో మాట్లాడిన పాక్ ప్రధాని ఉద్రిక్తతలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలని అరేబియా, యూఏఈతో సహా ఇతర గల్ఫ్ దేశాధినేతలను పాక్ ప్రధాని కోరారు. పాకిస్థాన్‌లోని సౌదీ రాయబారి నవాఫ్ బిన్ సయిద్ అల్ మాలికితో సమావేశంలో దక్షిణాసియాలో శాంతి, స్థిరత్వం కోసం పాకిస్థాన్ కృషి చేస్తుందని పాక్ ప్రధాని పునరుద్ఘాటించారని పీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది. పాకిస్థాన్‌లోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి హమర్ ఒబైద్ ఇబ్రహీం అల్ జాబీతో కూడా పాక్ ప్రధాని సమావేశమయ్యారు. కువైట్ రాయబారి నాసన్ రెహ్మన్ జాసన్‌ను కూడా పాక్ ప్రధాని కలిసి విజ్ఞప్తి చేశారు.


ఇది కూడా చదవండిపలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.వేలు! ఈ పథకం గురించి తెలుసాదరఖాస్తు చేస్కోండి!

 

కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట! ఇకపై ప్రతి ఆంధ్రుడు..

 

షాకింగ్ న్యూస్.. తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. అతనే కారణమా?

 

గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?

 

గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!

 

ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!

 

అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #Pakistan #IndiaPakistanTensions #PahalgamAttack #ArabSupport #ShahbazSharif #Geopolitics #SouthAsiaCrisis